పలాస, జూన్ 6 (వై7 న్యూస్): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంపై పలాసలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు జరిగింది.
సమావేశంలో నియోజకవర్గంలోని మండల నాయకులు, యూనిట్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, క్లస్టర్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను గ్రామ స్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించడం, జాబితాలోని పొరపాట్లను సరిదిద్దడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.








