E-PAPER

డీఎస్పీ అరుణ్ కుమార్‌ను కలిసిన ఐజేయూ నాయకులు

భద్రాచలం;
భద్రాచలం సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్‌ను శనివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు జాగు వెంకటరత్నం, జిల్లా కార్యదర్శి జునుమాల రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన డీఎస్పీ అరుణ్ కుమార్, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖకు మీడియా సహకారం ఎంతో అవసరమని అన్నారు.

సమాజ హితం, నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన, పాత్రికేయులు పోలీసు శాఖతో సమన్వయం కొనసాగిస్తూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐజేయూ నేషనల్ సభ్యుడు బి.వి. రమణారెడ్డి, క్రాంతి శ్రీనివాస్, సత్యానంద్, గిరి ప్రసాద్, రంజిత్ కుమార్, దిలీప్ కుమార్, రాజా కిరణ్, శ్రీశ్రీ, మదార్, లక్ష్మీనరసింహారావు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News