బడ్జెట్ ధరలో కీప్యాడ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం ఐటెల్ భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. iTel Ace 3 Heera పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధరను కేవలం రూ.949గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ ధరలో ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌లో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అందించడం ప్రధాన ప్రత్యేకతగా నిలిచింది. సాధారణంగా ఈ ధర విభాగంలోని చాలా కీప్యాడ్ ఫోన్లలో మైక్రో-USB పోర్ట్‌నే ఉపయోగిస్తారు. అయితే Ace 3 Heeraలో Type-C పోర్ట్ ఉండటంతో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగించే Type-C కేబుల్‌తోనే ఈ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ధరలో Type-C ఛార్జింగ్ పోర్ట్ అందించిన తొలి ఫీచర్ ఫోన్ ఇదేనని ఐటెల్ పేర్కొంది. భవిష్యత్తులో తమ అన్ని ఫీచర్ ఫోన్లలో Type-C పోర్ట్‌ను అందించాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో తక్కువ బడ్జెట్ కీప్యాడ్ ఫోన్ విభాగంలో Ace 3 Heera ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.








