
భద్రాచలం, సెప్టెంబర్ 20: భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జోజు మినరల్ వాటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఆదివారం ప్రారంభమైంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు.

ప్లాంట్ నిర్వాహకుడు జాకీర్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన పొదెం వీరయ్య, ప్లాంట్ ప్రారంభ అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి రానుంది.
కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ దొర, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వాసిరెడ్డి సాంబశివరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మనపల్లి ఆదినారాయణ, తమల్ల వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ చెంచు సుబ్బారావు, అక్బర్, కొలపూడి వరుణ్, INTUC శ్రీనివాస్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17








