E-PAPER

జంతర్ మంతర్ నిరసనపై మాటల యుద్ధం.. రాహుల్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్

జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బీజేపీ స్పందించింది. నిరసన సందర్భంగా ఎలాంటి కాల్పులు జరగలేదని బీజేపీ నేత సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ అంశంగా మార్చకూడదని ఆయన సూచించారు. జార్ఖండ్ విద్యార్థుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ.. వారి పరిస్థితిని అంచనా వేయడానికి రాంచీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నిరసనకారులు హాజరయ్యారు. తమ హక్కుల కోసం గళం విప్పుతున్న యువతపై లాఠీఛార్జ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు. 15 ఏళ్ల బాలికను క్షమాపణ చెప్పాలని బలవంతం చేయడం అన్యాయమని ఆయన తీవ్రంగా ఖండించారు.

పేలవమైన విద్యా వ్యవస్థ, పేపర్ లీక్‌లు వంటి సమస్యలపై ప్రశ్నించడం నేరం కాదని రాహుల్ గాంధీ అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతపై చర్యలు తీసుకోవడం కంటే వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు. మరోవైపు, రాహుల్ ఆరోపణలను బీజేపీ ఖండించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!