E-PAPER

చింతూరు ఐటీడీఏ పిఓ శుభం నొక్వల్ స్వయంగా భవ్యకు మాట ఇచ్చిన న్యాయం జరగలేదా..?

వీరాపురం గ్రామంలో భవ్యకు హర్హత ఉన్న తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా..

చింతూరు,(వై7 న్యూస్ తెలుగు) సెప్టెంబర్ 20: చింతూరు మండలంలోని విరాపురం గ్రామానికి చెందిన పిసం నాగయ్య మరియు లక్ష్మి దంపతుల కుమార్తె పిసం భవ్య నిరుపేద ఆదివాసీ కుటుంబము . ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకం డబ్బులు హర్హత ఉన్న అకౌంట్ లో జమ కాలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పత్రిక విలేకరుల సమాచారం ఇవ్వగా వివిధ పత్రికలో కథనాలు ప్రచురించబడ్డాయి. కథనాలకు స్పందించిన చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్ వీరాపురం గ్రామానికి చేరుకొని బాధితులతో మాట్లాడి, సమస్యను తెలుసుకున్న పిఓ శుభం నొక్వల్, భవ్య కుటుంబ సభ్యులకు తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో జమ చేసేటట్లు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.అయిన ఆగస్టు చివరి వారంలో విడుదల అయిన జాబితాలో డబ్బులు జమ కాకపోవడంతో, స్వయంగా ఐటీడీఏ పిఓ ద్వారా కూడా న్యాయం జరగకపోవడంతో ఆందోళనలో చెందుతున్నారు. మా గోడును ఎవరికి వెళ్లబోసుకోవాలి..? ఎవరుస్పందించి న్యాయంచేస్తారు..? జరిగిన సంఘటన చూసి అధికారుల చర్యలు కూడా శూన్యమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు పిఓ శుభం నొక్వల్ స్పందించి తగు న్యాయ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!