అమరావతి, సెప్టెంబర్ 20 (వై7 న్యూస్ తెలుగు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పలు కీలక విభాగాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
ఎస్పీఎఫ్ డీజీగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ త్రివిక్రమ వర్మకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు.
ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి. రాజకుమారిని రైల్వే ఐజీగా నియమించారు. అదనంగా సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీ బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు.
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా నియామకం కల్పించారు.
రాష్ట్ర పోలీసు శాఖలో పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.








