E-PAPER

వినాయక నిమజ్జనం నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం..లారీని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి

బాపట్ల, సెప్టెంబర్ 20 (వై7 న్యూస్ తెలుగు): బాపట్ల జిల్లాలో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. కారంచేడు మండల పరిధిలోని ఎన్‌హెచ్-167ఏ వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై బోడవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వినాయక నిమజ్జన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రతకు బైక్‌పై ఉన్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరొకరి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని ఆనందంగా తిరిగి వస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో బోడవాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!