E-PAPER

‘హుషార్ పిట్టలు’ ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్ అయిన నటుడు భాను.. కన్నీళ్లు ఆపుకోలేక!

సినిమా అంటే పిచ్చితో ఎన్నో ఏళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూసిన ఓ సాధారణ యువకుడి కల నిజమైన క్షణం ‘హుషార్ పిట్టలు’ ప్రెస్‌మీట్‌లో కనిపించింది. ఈ సినిమాలో ‘పుట్ట భాను’ పాత్రలో నటించిన భాను తొలిసారి కెమెరా ముందు మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పెద్ద తెరపై తనను చూసుకుని ప్రేక్షకులు నవ్వుతుంటే భావోద్వేగానికి గురయ్యానని, ఇది కలనా.. నిజమా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని భాను కన్నీళ్లతో చెప్పాడు.

తనకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమని భాను తెలిపాడు. అవకాశాల కోసం ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా నటుడిగా నిరూపించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగానని చెప్పాడు. సినిమా ఛాన్స్ కోసం బోయిన్‌పల్లి ఎల్లమ్మ తల్లికి మొక్కుకుని, ప్రతి మంగళవారం చెప్పులు లేకుండా తిరిగానని, సినిమా విడుదలైన తర్వాత 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నట్లు వెల్లడించాడు. తన కలను నెరవేర్చుకునే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు.

తనకు మంచి పాత్ర ఇచ్చి నటుడిగా నిలబెట్టిన దర్శకుడు భిక్ష అన్న, నిర్మాత వెంకట్ యాదవ్ అన్నలకు భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని, అమ్మవారితో పాటు తనకు జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు కూడా ప్రత్యేకంగా 100 కొబ్బరికాయలు కొడతానని చెప్పాడు. చిన్న పాత్ర అనుకున్న తనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఇచ్చిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపాడు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!