E-PAPER

పెంటిభద్రలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

పలాస, జూన్ 6 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెంటిభద్ర గ్రామ పరిసర ప్రాంతంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.గ్రామ సమీప ప్రాంతంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడి గుర్తింపుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News