శ్రీకాకుళం జిల్లా, పలాస వై7 న్యూస్, జూన్ 1:
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఏఎస్‌పేట వద్ద ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ఆ మోహన్ నాయుడు.
ఈ సందర్భంగా మంత్రి బోర్డు ఆవిష్కరించిన అనంతరం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశాన్ని అందించారు. ఉత్తరాంధ్రలోని రైల్వే వ్యవస్థను సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురావడంతో, ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏఎస్‌పేట వద్ద ఈ బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల నెరవేరిందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Post Views: 15








