వై 7 న్యూస్ | పలాస | మే 30
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు.
శుక్రవారం శ్రీకాకుళంలోని జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెరిట్ సాధించిన పలువురు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఎంపిక ప్రక్రియపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు
Post Views: 11








