వై 7 న్యూస్ | పలాస | మే 30
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ దండాయన్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.వి. మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళలు, బాలికల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, వరకట్న వేధింపులు వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
సమాజంలో మహిళలకు భద్రత కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు చట్టపరమైన చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. మహిళలు, బాలికలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Post Views: 8








