E-PAPER

ప్రజాస్వామ్యమా… పోలీసుల రాజ్యమా..?

సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం..? రైతు కుటుంబం ఆవేదన..!

ములుగు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఆధారంగా రైతుపై కేసు నమోదు

20 రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని లబోదిబో అంటున్న రైతు..

బెదిరింపులు, ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని వాపోయిన రైతు

సివిల్ వివాదంలో పోలీసుల పాత్రపై ప్రశ్నలు..?

వై7 న్యూస్ , ములుగు జిల్లా

ములుగు జిల్లాలో 2022 సంవత్సరంలో ఓ రైతు మరియు ఫర్టిలైజర్ వ్యాపారి మధ్య జరిగిన క్రయవిక్రయ లావాదేవీలకు సంబంధించి తాజాగా ములుగు జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో వివాదం కొత్త మలుపు తిరిగింది.ఫిర్యాదు ఆధారంగా సంబంధిత రైతును స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు గత 20 రోజులుగా పలుమార్లు విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారి సినిమా స్టైల్‌లో బెదిరింపులకు పాల్పడుతూ, వివిధ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.మేము ఇచ్చిన పిర్యాదు పట్టించుకోకుండా ఏక పక్షంగా కేసు నమోదు చేసి అంతేకాకుండా, కేసు నమోదు చేసిన తర్వాత కూడా పెద్దమనుషుల సమక్షంలో రాజీ చేసుకోవాలని సూచిస్తూ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని, కానిస్టేబుల్‌పై దాడి చేశారనే ఆరోపణలతో మరో కేసు పెడతామని, ఎవరికి చెప్పుకున్నా నన్ను ఏమీ చేయలేరని ఎవరికైనా చెప్తే మీరు జీవితాంతం జైల్లో ఉండేలాగా చేస్తానని సదరు ఎస్ఐ బాధిత రైతును బెదిరింపులు గురిచేస్తున్నట్లు బాధిత రైతు తెలిపారు..ఈ వ్యవహారంలో అసలు సివిల్ స్వభావం ఉన్న ఆర్థిక లావాదేవీ వివాదంలో పోలీసులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చట్టపరంగా సివిల్ వివాదాలకు కోర్టులే సరైన వేదిక కాగా, పోలీసుల పాత్ర ఏమిటనే అంశంపై న్యాయ నిపుణులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఈ ఆరోపణలపై పోలీసు శాఖ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. రైతు కుటుంబం చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News