శ్రీకాకుళం:జిల్లా పోలీస్ కార్యాలయం: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (PGRS) ద్వారా అందిన ఫిర్యాదులను నిబద్ధతతో పరిశీలించి, చట్టపరంగా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ పోలీసు అధికారులకు ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 79 ఫిర్యాదులు స్వీకరించబడినట్లు తెలిపారు.ప్రతి ఫిర్యాదును చట్టపరంగా విచారించి, సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారులకు భరోసా కల్పించారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి, వెంటనే విచారణ ప్రారంభించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, పురోగతి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత వ్యవహారాలు, ఆస్తి తగాదాలు, సైబర్ సమస్యలు వంటి వివిధ అంశాలకు సంబంధించిన మొత్తం 79 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి.








