వై 7 న్యూస్ పలాస ;
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కండ్రగడ గ్రామంలో సోమవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. చదువుకుంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామంలో జరిగిన ఓ వేడుకకు షామియానా కట్టేందుకు వచ్చిన యువకుడు స్నానానికి చెరువులోకి వెళ్లాడు. ఈ సమయంలో జారి పడడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు.
మృతుడిని విజయనగరం జిల్లాకు చెందిన భాను (19)గా గుర్తించారు. సమాచారం అందుకున్న టెక్కలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Post Views: 12








