వై 7 న్యూస్ పలాస ;
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో ఆదివారం, సోమవారం వచ్చిన ఈదురు గాలులు మరియు వర్షాలకు అరటి పంటకు భారీ నష్టం వాటిల్లింది. పెద్ద పద్మాపురం, కోసమాల, పెద్ద లక్ష్మీపురం, సిరియాఖండి, పట్టుపురం తదితర గ్రామాల్లో రైతులు విస్తృతంగా అరటి తోటల పెంపకం చేపడుతున్నారు.
వర్షాల సమయంలో వచ్చిన బలమైన ఈదురు గాలులకు సుమారు రెండు ఎకరాల్లో పెంచిన 400 అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు.
పంట నష్టంపై ప్రభుత్వం స్పందించి తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Post Views: 5








