E-PAPER

పలాసలో స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

పలాస: శ్రీకాకుళం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పలాసలో స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్కేటింగ్ కోచ్ జి. గోపాలకృష్ణ తెలిపారు.

ఈ శిబిరం మొత్తం 30 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం శిక్షణ ఇవ్వబడుతుందని చెప్పారు. స్కేటింగ్‌పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు మరియు ఫోటోతో హాజరు కావాలని సూచించారు.

ఈ కోచింగ్‌లో పాల్గొనడానికి వయస్సు పరిమితి 8 నుండి 16 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు పూర్తి వివరాల కోసం 9290905399 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News