E-PAPER

అగ్నివీరులకు మరో రెండేళ్లు సర్వీసు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం .

అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరిన అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉన్న నాలుగేళ్ల సర్వీసుకు అదనంగా మరో రెండేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. తొలి బ్యాచ్‌ అగ్నివీరుల పదవీకాలం ముగియనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నిర్ణయం ప్రకారం, నాలుగేళ్ల సేవ తర్వాత సాధారణ విధానంలో శాశ్వత సైనికులుగా ఎంపిక కాని మిగిలిన 75 శాతం అగ్నివీరులకు మరో రెండేళ్లు పనిచేసే అవకాశం లభించనుంది. ఈ పొడిగించిన సేవ పూర్తయ్యాక కూడా ప్రతిభ ఆధారంగా సాధారణ సైనిక విభాగంలో చేరేందుకు అవకాశం కల్పిస్తామని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ ఎన్‌.ఎస్‌. రాజా సుబ్రమణి వెల్లడించారు.

అగ్నిపథ్‌ పథకం 2022లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పథకం కింద సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడుతున్నారు. ఈ గడువు ముగిసిన తర్వాత ప్రతి బ్యాచ్‌లో గరిష్ఠంగా 25 శాతం మందిని ప్రతిభ, సైనిక దళాల అవసరాల ఆధారంగా సాధారణ సర్వీసులో కొనసాగించే అవకాశం ఉంది. మిగిలినవారు విధుల నుంచి వైదొలగాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో వారికి అదనపు సేవా అవకాశం లభించనుంది. 

నియామక ప్రక్రియలోనూ మార్పులు ప్రకటించారు. ఇకపై శారీరక పరీక్షకు ముందుగా రాత పరీక్ష నిర్వహించనున్నారు. సైన్యంలో పనిచేసిన సమయంలో అగ్నివీరులు పొందిన శిక్షణ, నైపుణ్యాలను గుర్తిస్తూ ధ్రువపత్రాలు కూడా అందించనున్నారు. తొలి బ్యాచ్‌లో సుమారు 18 వేల మంది అగ్నివీరుల నాలుగేళ్ల సర్వీసు గడువు 2026 డిసెంబరులో ముగియనుండటంతో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!