E-PAPER

చలి ఉదయం.. పక్షవాతానికి సమయం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి. !

శీతాకాలం చలి తీవ్రత పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పక్షవాతం (స్ట్రోక్) బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే చలికాలంలో స్ట్రోక్ కేసులు 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతున్నాయని ఆసుపత్రి గణాంకాలు, వైద్య అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు ప్రమాదకరం?
వాతావరణం చల్లబడినప్పుడు, శరీరం తనలోని వేడిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా రక్తనాళాలు సంకోచిస్తాయి (ముడుచుకుపోతాయి). దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా పెరుగుతుంది. పెరిగిన రక్తపోటు పక్షవాతానికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి.

ముఖ్యంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి విశ్రాంతి తర్వాత శరీరం మేల్కొనే సమయంలో సహజంగానే రక్తపోటు కొద్దిగా పెరుగుతుంది. దీనికి చల్లటి వాతావరణం కూడా తోడవడంతో రక్తపోటు అదుపుతప్పే అవకాశం ఉంటుంది. ఈ రెండు అంశాలు కలిసి పక్షవాతం ముప్పును రెట్టింపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
పక్షవాతం ముప్పు వృద్ధులలో ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్), మధుమేహం (షుగర్), అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరితో పాటు ధూమపానం చేసేవారు, గతంలో పక్షవాతం లేదా గుండెపోటు వచ్చిన వారు కూడా అధిక రిస్క్ గ్రూప్‌లో ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!