E-PAPER

పోలీస్ స్టేషన్ అడ్డాగా సెటిల్మెంట్..!?

*వెంకటాపురంలో ఆడబిడ్డకు అన్యాయం ?*

*ఇరవై రోజులుగా పసి గుడ్డుతో వెంకటాపురంలో న్యాయపోరాటం..*

*ఆడబిడ్డ కష్టారిజాతన్ని ఐదుఏండ్లు తిని చివరికి ముష్టి వేసిన పెద్ద మనుషులు..*

*కన్న బిడ్డల చూసుకుంటామని మాట ఇచ్చి
చివరకు కష్టాన్ని దోచుకుంటారా.!*

*ఇదేనా మానవత్వం అంటే..?*

వై 7 న్యూస్ తెలుగు:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఓ యువతి అన్యాయానికి గురైన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆడబిడ్డకు న్యాయం చేయాల్సిన చోట, పోలీస్ స్టేషన్‌నే సెటిల్మెంట్ కేంద్రంగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆరు సంవత్సరాల వయసులో ఒక కుటుంబం వద్ద పెరిగిన ఈ యువతి, పెద్దయ్యాక ఉద్యోగం చేస్తూ సంపాదించిన మొత్తాన్ని అదే కుటుంబ అభివృద్ధికి ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అనంతరం స్వయంగా వివాహం చేసుకుని, ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే, తాను సంపాదించిన డబ్బులు, బంగారం గురించి అడగగా, “మాకు ఎప్పుడు ఇచ్చావు..? ఆధారాలు ఏమిటి..?” అంటూ ఆమెను తిరస్కరించి, బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై బాధిత యువతి గత 20 రోజులుగా వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేశారని సమాచారం. చివరకు కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News