వై7 న్యూస్ – పలాస
పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మే 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని టెన్నిస్, స్కైటింగ్, అథ్లెటిక్స్, కోకో వంటి క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కృషి ఉంటే క్రీడల్లో మంచి భవిష్యత్ సాధించవచ్చని అన్నారు.
ఈ శిబిరానికి తవిటయ్య, రామారావు, తిరుమలలు శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా శిక్షణ పొందుతున్నారు.
Post Views: 8








