పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నెలవారీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ములు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆనందం స్పష్టంగా కనిపించింది.అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రెండు సంవత్సరాల పాలనా విజయాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 10








