E-PAPER

పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

పలాస: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన వారు, ప్రయాణికులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా, డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శాసనపూరి మురళి ఆర్థిక సహకారంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
రోజువారీగా పలాస బస్ డిపోకు వచ్చే వందలాది మంది ప్రయాణికులు, సిబ్బంది ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ప్రోత్సహించబడతాయని అధికారులు తెలిపారు.
సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సహకరించిన మురళి ని పలువురు అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News