మణుగూరు ;
చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం పోరాడాలని టి.యు.సి.ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను పిలుపునిచ్చారు.
ఆదివారం మేడే సందర్భంగా స్థానిక టి.యు.సి.ఐ కార్యాలయం వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తరాల కార్మికులు రక్త తర్పణంతో సాధించిన కార్మిక హక్కులను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చిందని విమర్శించారు.
ఈ లేబర్ కోడ్స్ లక్ష్యం కార్మికుల శ్రమను చౌకగా కార్పొరేట్ శక్తులకు అందించడమేనని అన్నారు. వీటిని రద్దు చేయించడం కార్మిక వర్గం బాధ్యతగా ఉందని పేర్కొన్నారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల వల్ల కార్మికులపై, ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని, చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఈ లేబర్ కోడ్స్ రద్దుకు, యుద్ధ భారాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి. సంజీవరెడ్డి, బత్తుల వెంకటేశ్వర్లు, వి. జానయ్య, సతీష్, వంశీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.








