పలాస ; ప్రతి పౌరుడు సెల్ఫ్ జనగణన ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు పిలుపునిచ్చారు.ఈ మేరకు నేడు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలకు జనగణన ప్రాముఖ్యతను వివరించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పురపాలక సంఘం సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని జనగణనపై అవగాహన పెంపొందించారు.
Post Views: 18








