E-PAPER

రాష్ట్ర కార్యవర్గంలో పొడియం బాలరాజుకు స్థానం

వై7 న్యూస్ | పినపాక

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొడియం బాలరాజు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తనను రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి, జాతీయ నాయకుడు బండి సంజయ్ కి, ఎంపీ ఈటెల రాజేందర్ కి, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.

జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి తన ముఖ్య లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని బాలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News