వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారిపై పాకివలస సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కూరగాయల వ్యాపారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.స్థానికుల వివరాల ప్రకారం… ద్విచక్ర వాహనంపై కూరగాయలు అమ్ముకొని తిరిగి వస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన వెంటనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పొన్నాడపేటకు చెందిన మురళి (38)గా గుర్తించినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Post Views: 10








