వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్తకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సోంపేట అదనపు జడ్జి కే. కిషోర్ బాబు తీర్పు ప్రకటించారు.
జిల్లా ఎస్పీ కే.వి. మహేశ్వరి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మెలియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర పద్మను ఆమె భర్త జోగారావు 2021 అక్టోబర్ 21న నాటు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నేరం రుజువు కావడంతో కోర్టు భర్త జోగారావుకు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Post Views: 30








