పినపాక
వాహనాలకు పెండింగ్ చాలానాలను చెల్లించాలని ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ సూచించారు. గురువారం పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఎస్ఐ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి పెండింగ్ చలానాలను ఆన్లైన్ ద్వారా పరిశీలన చేస్తున్నారు. పెండింగ్ చలనాలు ఉంటే వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లక్ష్మయ్య, సుభాష్, భద్రం, తదితరులు పాల్గొన్నారు
Post Views: 13








