దిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కు పెరుగుతాయని, అలాగే తెలంగాణలో 17 స్థానాలు 26కు పెరుగుతాయని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా లోక్సభ స్థానాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల జనాభా శాతానికి మించి సీట్ల పెంపు ఉంటుందని పేర్కొన్న ఆయన, డీలిమిటేషన్ విషయంలో విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
దేశవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం కల్పించడమే డీలిమిటేషన్ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు.
Post Views: 33








