వై 7 న్యూస్
వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయంలోని కమిటీ హాల్-2లో జరిగిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (PUC) సమావేశంలో రాష్ట్రానికి చెందిన కీలక ప్రజా రంగ సంస్థల పనితీరుపై సవివరంగా చర్చ జరిగింది.
గత ఐదేళ్ల వార్షిక నివేదికలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో APSRTC, APPDCL, APPFCL, APMDCL మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వంటి సంస్థల పనితీరును లోతుగా విశ్లేషించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిటీ స్పష్టం చేసింది. ప్రజా నిధుల వినియోగం సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రజా రంగ సంస్థలు కీలకమని పేర్కొంటూ, వాటి పనితీరును మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.








