E-PAPER

బీజేపీ ఆధ్వర్యంలో టేకులపల్లిలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

టేకులపల్లి ;
టేకులపల్లి మండలంలో బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తేజావత్ శంభూ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్రను నేతలు వివరించారు. సామాజిక సమానత్వం, విద్య, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో టీచర్స్ సెల్ జిల్లా కన్వినర్ వి. హతిరం నాయక్, నియోజకవర్గ నాయకులు బోడ పూన్య నాయక్, రవి రాథోడ్, మండలం ప్రధాన కార్యదర్శి బాధవత్ సురేష్ నాయక్, సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వర్లు, ద్రావ్ సింగ్ సత్యం, మహిళా నాయకురాలు పార్వతి, బోడ గంగా, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News