E-PAPER

మణుగూరులో అరుదైన పోలీస్ అధికారి

మణుగూరు;

జర్నలిస్ట్‌గా నా ప్రయాణంలో అనేక మంది పోలీస్ అధికారులను చూశాను. కానీ అందరిలోకి భిన్నంగా నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది మణుగూరు సీఐ పాటి నాగబాబు గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మణుగూరులో సీఐగా బాధ్యతలు స్వీకరించి ఎక్కువ నెలలు కూడా కాలేదు. కానీ ఈ తక్కువ సమయంలోనే ఆయన తన పని తీరుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఎప్పుడూ సీరియస్‌గా, క్రమశిక్షణతో పనిచేస్తూ కనిపిస్తారు. ఆయనలో ఒక విశేషం ఏమిటంటే చేయాల్సిన పనిని ఇతరులపై నెట్టివేయకుండా, స్వయంగా బాధ్యత తీసుకుని పూర్తి చేయడం. రికార్డులు కూడా ఆయనే స్వయంగా నిర్వహించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
ఆయన పని విధానంలో అత్యంత ప్రత్యేకత ,
న్యాయం ముందు ఎలాంటి రికమండేషన్ అవసరం లేదన్న స్పష్టమైన నమ్మకం. మీ దగ్గర నిజం ఉంటే, ధైర్యంగా వెళ్లి సమస్య చెప్పండి… నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని నేను నమ్మకంగా చెబుతున్నాను.
డబ్బు, ఒత్తిళ్లు, పరిచయాలు ఇవేవీ ఆయనను ప్రభావితం చేయవు. ఉన్నత కుటుంబానికి చెందిన ఆయన, కేవలం ఉద్యోగ సంతృప్తి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ప్రతి చర్యలోనూ ఆయనలో కనిపించేది ఆత్మగౌరవం, నిజాయితీ.
మణుగూరులో జరిగిన ఎన్నో సున్నితమైన సంఘటనల్లో ఆయన చూపిన ధైర్యం, నిష్పక్షపాత వైఖరి ప్రశంసనీయం. ముఖ్యంగా తోగ్గుడెం గ్రామంలో జరిగిన సమ్మక్క-సారక్క జాతరలో, మూడు రోజుల పాటు నిద్రాహారాలు మానేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేసిన తీరు ఒక ఉదాహరణగా నిలిచింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, చివరికి జాతర ముగిసిన తర్వాత ఆయన తీసుకున్న ఆ చిన్న నిట్టూర్పు ఆ క్షణం ఆయన సేవా భావానికి ప్రతీక.
అలాగే మణుగూరు పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై కఠిన చర్యలు తీసుకుంటూ, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనవసరంగా మోడిఫై చేసిన సైలెన్సర్లను తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రాన్ని కుదిపేసే సంఘటనలు జరిగిన సందర్భాల్లో కూడా చట్ట పరిమితుల్లోనే పనిచేస్తూ, శాంతి భద్రతలను కాపాడడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేసి, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పరిస్థితులను నియంత్రించారు.
సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నం. సీఐ గారే బయటికి వచ్చి ప్రజల సమస్యలను విని, తక్షణమే పరిష్కారం చూపడం ఆయన ప్రత్యేకత.
ఈ అన్ని విషయాలను దగ్గరగా చూసిన ఒక జర్నలిస్టుగా, ఈ మాటలు రాయాలనే అనిపించింది. న్యాయం, నిజాయితీ, కర్తవ్య నిబద్ధత కలిగిన ఇలాంటి అధికారులు సమాజానికి ఎంతో అవసరం.
మీరు ఎప్పటికీ ఇలాగే న్యాయానికి దగ్గరగా ఉంటూ, పేద ప్రజలకు విలువైన సేవలు అందిస్తూనే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

– మీ పులిపాటి పాపారావు | జర్నలిస్ట్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News