E-PAPER

బ్రిలియంట్ విద్యాసంస్థల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

వై 7 న్యూస్ | బూర్గంపాడు ;
స్థానిక సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు.మొదటగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గురుబ్రహ్మ అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఎన్.ఆర్ మాట్లాడుతూ… భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకరని కొనియాడారు. విద్య, ఐక్యత, క్రమశిక్షణ ద్వారానే దేశ అభ్యున్నతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.భిన్నత్వంలో ఏకత్వం అనే భావనతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన మహానుభావుడిగా అంబేద్కర్ నిలిచారని తెలిపారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News