టేకులపల్లి;
భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సులానగర్ మరియు టేకులపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం టేకులపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “Arrive Alive Campaign” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సి.ఐ. బత్తుల సత్యనారాయణ, ఎస్.ఐ. రాజేందర్ ఆధ్వర్యంలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్ నుండి సులానగర్ వరకు బైక్ ర్యాలీగా నిర్వహించారు.
ర్యాలీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వయంగా హెల్మెట్ ధరించి పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణాపాయాలను తగ్గించవచ్చని సూచించారు. అనంతరం పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లీశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవా నాయక్, నియోజకవర్గ నాయకుడు కోరం సురేందర్, మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
రిపోర్టర్ | సందీప్ కుమార్








