టెక్కలి ;
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని కచేరి వీధి రోడ్డుపై ఆదివారం రాత్రి ఓ ప్రమాదం తృటిలో తప్పింది. టెక్కలి అంబేద్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనకు ముందు అదే దారిలో వెళ్తున్న మరో వాహనం మరియు కారుకు మధ్య స్వల్ప ఘర్షణ జరగడం వల్ల పరిస్థితి అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో రెండు కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు జరగకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
Post Views: 26








