E-PAPER

పలాస రైల్వే స్టేషన్‌లో మహిళా టికెట్ కలెక్టర్‌పై ప్రయాణికుడి దాడి

పలాస: విధి నిర్వహణలో ఉన్న మహిళా టికెట్ కలెక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన పలాస రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

బరంపురానికి చెందిన ఓ ప్రయాణికుడు రైలులో నుంచి దిగి స్టేషన్‌ బయటకు వస్తుండగా విధుల్లో ఉన్న మహిళా టికెట్ కలెక్టర్ సుజాత అతడిని టికెట్ చూపించాలని కోరారు. అయితే తన వద్ద టికెట్ లేదని దురుసుగా సమాధానం చెప్పిన ప్రయాణికుడు.. అనంతరం టికెట్ కలెక్టర్ చెంపపై కొట్టినట్లు సమాచారం.

ఈ ఘటనతో స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ప్రయాణికులు, ఇతరులు వెంటనే అక్కడికి చేరుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని రైల్వే పోలీసులకు అప్పగించారు.

ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిపై దాడి జరగడంపై తోటి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!