E-PAPER

కృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో క్రిమినల్ కేసు..

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకుడు, బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణుడిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో క్రిమినల్ పరువునష్టం కేసు నమోదైంది. కృష్ణుడిని ఆరాధించే భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.

అజయ్ ప్రతాప్ సింగ్ అనే న్యాయవాది ఆగ్రా సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరిగిన ఓ రామకథ కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి ప్రసంగిస్తూ శ్రీకృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. “శ్రీకృష్ణుడు మోసగాడు, ఆయన నిలబడినప్పుడు మూడు వైపులకు వంగి ఉంటాడు” అంటూ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తులను బాధించాయని ఆరోపించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి శారీరక భంగిమలపై కూడా ఆయన పోలికలు తెచ్చినట్లు తెలిపారు.

ఇదే కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ… ద్వాపరయుగంలో మానవ రూపంలో జన్మించిన శ్రీకృష్ణుడి వారసులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని తెలిపారు. జాదూన్లు, జడేజాలు, భట్టీలు కృష్ణుడి వంశానికి చెందినవారేనని, తన తండ్రి వైపు నుంచి తాను కూడా ఆ వంశస్థుడినేనని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ జడ్జి కాంచన్ కుమార్… దీనిపై విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!