ఆలమూరు;
మండల కేంద్రమైన ఆలమూరులో ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ ఏజిపి బూసి విద్యా ప్రసన్న నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల అధ్యక్షులు ఈదల సత్తిబాబు, కాకినాడ సత్యం స్టడీ సర్కిల్ అధినేత బూసి విద్యా సాగర్ హాజరయ్యారు. గత నెల 28వ తేదీన నిర్వహించిన కంటి పరీక్షల్లో దృష్టి లోపాలు గుర్తించిన సుమారు 57 మంది రోగులకు ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు.
అనంతరం, విద్యాసాగర్ సతీమణి స్వర్గీయ బూసి ఝాన్సీ రాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ విద్యా ప్రసన్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చెప్పారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు. స్వంతంగా సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈదల నల్లబాబు, చీపురపల్లి గణేష్, మానేపల్లి శ్రీనివాస్, లంక శ్యామ్, నెల్లి చిన్న, దిడ్డి రాము, బూసీ చిట్టి కుమార్, ముప్పిరి వెర్రియ్య తదితరులు పాల్గొన్నారు.









