E-PAPER

అందుబాటులోకి వచ్చిన సైన్స్ మ్యూజియం – విద్యార్థులకు కొత్త విజ్ఞాన వేదిక..!

Y7 న్యూస్ తెలుగు | ఖమ్మం

ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా సైన్స్ మ్యూజియం & సైన్స్ సెంటర్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి చైతన్య జైని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇలాంటి సైన్స్ మ్యూజియంలు ఎంతో కీలకమని తెలిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఈ మ్యూజియం ముఖ్య వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రాయోగిక నమూనాలు విద్యార్థులకు శాస్త్ర సూత్రాలను సులభంగా అర్థమయ్యేలా సహాయపడతాయని, రిసోర్స్ పర్సన్ టీచర్లు వీటిని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం పెంపొందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని మాట్లాడుతూ, ఈ సైన్స్ మ్యూజియం ఖమ్మం జిల్లాలో విద్యా అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారి నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వంతోనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవి మారుత్ (దాత), జిల్లా విద్యాశాఖ అధికారులు, సైన్స్ ఫోరం బాధ్యులు, వివిధ మండలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News