పాల్వంచ, సెప్టెంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 23న పాల్వంచలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారులు తెలిపారు.
జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా జరగనుంది. ఈ మేళాలో అపోలో ఫార్మసీ, హైదరాబాద్, రిలయన్స్ జియో సంస్థల్లో మొత్తం 105 ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు.
అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. ఫార్మసిస్ట్ పోస్టులకు డి/బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ (PCI) అర్హత ఉండాలి. ట్రైనీ ఫార్మసిస్ట్ పోస్టులకు డి/బి.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ అర్హత అవసరం. ఫార్మసిస్ట్ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులకు ఎస్సెస్సీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు అర్హులు.
అదేవిధంగా రిలయన్స్ జియోలో జియో పాయింట్ మేనేజర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ అర్హతతో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టును బట్టి నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
18 నుంచి 35 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో నిర్ణీత సమయానికి జాబ్‌మేళాకు హాజరు కావాలని తెలిపారు.
సంప్రదించాల్సిన నంబర్లు:
అపోలో ఫార్మసీ HR – T. రఘుపతి: 72079 17714
రిలయన్స్ జియో HR – ఉదయ్ పొరికా: 93915 39320








