వై 7 న్యూస్ పలాస
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల భాగంగా, మంగళవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశానికి సైనికులు ఎలా రక్షణగా ఉంటారో, సమాజంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అంతే కీలక పాత్ర పోషిస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడుతున్నారని కొనియాడారు.అనంతరం అగ్నిమాపక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 11








