వై 7 న్యూస్ | మణుగూరు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాన్ని మణుగూరు మండల సేవాలాల్ సేన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూడ్ రత్నం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర నిర్మల, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఇస్లావత్ కోటియ, మండల అధ్యక్షులు గూగులోత్ రవి నాయక్, మహిళా అధ్యక్షురాలు ఇస్లావత్ ద్వాలి, మహిళా ఉపాధ్యక్షురాలు గూగులోత్ కవితతో పాటు సేవాలాల్ సేన సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 26









