Y7 న్యూస్ పలాస
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. మున్సిపాలిటీ పరిధిని విస్తరించడంతో పాటు, మొత్తం 36 వార్డులుగా వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించారు. పెరుగుతున్న జనాభా అవసరాలు, భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్ర ప్లానింగ్ అధికారులు సిద్ధం చేశారు.
ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సువిశాల రహదారులు, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ, మెరుగైన తాగునీటి సదుపాయాలు, పచ్చదనం పెంపు, ట్రాఫిక్ నియంత్రణకు అనుకూల మార్గాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరాన్ని మరింత స్మార్ట్‌గా, ప్రజలకు సౌకర్యవంతంగా మార్చేలా రూపకల్పన చేయడం విశేషం.
మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దేందుకు ఈ రోజు మున్సిపల్ అధికారులు మరియు సుడా (SUDA) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా అన్ని అనుమతులు పూర్తి చేసి, ప్రణాళికను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సుడా అధికారులు పాల్గొన్నారు.








