వై7 న్యూస్ పలాస , శనివారం:
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండి పంచాయతీ పరిధిలో చెరువుల ఆక్రమణపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గౌతు శిరీషకు శనివారం ఫిర్యాదు చేశారు.
గ్రామస్థుల వివరాల ప్రకారం, సర్వే నంబర్ 22లో ఉన్న అగర్ల చెరువు సుమారు 5 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండగా, సర్వే నంబర్ 38లో ఉన్న పెద్దకారి చెరువు 7 ఎకరాలు 37 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 3 ఎకరాల చెరువు గర్భం ఆక్రమణకు గురైందని వారు తెలిపారు.
చెరువు గర్భంలో అక్రమంగా లేఅవుట్ వేసి, వైసీపీకి చెందిన బొత్స షణ్ముఖరావు కోట్ల రూపాయలు దోచుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి, ఆక్రమణలను తొలగించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
Post Views: 10








