E-PAPER

జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివి.. ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, శనివారం:
మహానుభావుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పలాసలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గౌతు శిరీష, పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా విస్తరణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాదులు వేసిన గొప్ప నాయకుడిగా ఆయనను అభివర్ణించారు.
పూలే అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News