మధిర;
ఖమ్మం జిల్లా మధిర మండలం అంబేరుపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నాగవరపాడు గ్రామానికి చెందిన తోక వెంకయ్య (55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 100








