వై 7 న్యూస్ పలాస
పలాస ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు సహించబోమని ఏపీ సంక్షేమ మౌలిక వసతులు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పీఎం జే బాబు హెచ్చరించారు.
సోమవారం పలాస మండలం లొత్తూరు గ్రామంలోని ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వసతి గృహ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పీఎం జన్మష్ నిధులతో చేపడుతున్న ఈ పనులను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టంగా సూచించారు.పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, నాణ్యత లోపాలు కనబడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు ప్రజల అభివృద్ధికి వినియోగించబడుతున్నందున ప్రతి రూపాయి విలువ తెలిసేలా పనులు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 5








