E-PAPER

HP OmniPad 12 భారత్‌లో లాంచ్.. 2K 90Hz డిస్‌ప్లే, Snapdragon 6 Gen 3తో ఆకట్టుకునే ట్యాబ్లెట్

హెచ్‌పీ (HP) భారత మార్కెట్లో కొత్త HP OmniPad 12 ట్యాబ్లెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, తొలిసారి ట్యాబ్లెట్ కొనుగోలు చేసే వినియోగదారులు, MSMEలు, యువ ప్రొఫెషనల్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డివైస్ డిటాచబుల్ కీబోర్డ్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా iPrep (iDream Education), Lexillion (StudyMatix), Brands.live వంటి విద్యా, స్కిల్లింగ్ యాప్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేసి అందించడం విశేషం.

ఈ ట్యాబ్లెట్‌లో 12 అంగుళాల 2K (2000×1200 పిక్సెల్స్) మల్టీ-టచ్ డిస్‌ప్లేను అందించారు. 16:10 ఆస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్, 100% sRGB కలర్ గామట్ సపోర్ట్‌తో స్పష్టమైన, నాణ్యమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. విద్య, వినోదం, ఆఫీస్ పనులకు ఈ డిస్‌ప్లే అనుకూలంగా ఉంటుంది.

పనితీరు విషయానికి వస్తే, Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో పాటు Adreno GPU, 8GB LPDDR5 RAMను ఇందులో అందించారు. 128GB, 256GB UFS స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉండగా, microSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. దీంతో పెద్ద మొత్తంలో ఫైల్స్, డాక్యుమెంట్లు, వీడియోలను సులభంగా నిల్వ చేసుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!